close
Choose your channels

మోడి బయోపిక్ లో అక్షయ్...

Wednesday, June 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడు బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఇప్పటి వరకు ఆటగాళ్ళకు సంబంధించిన బయోపిక్‌లే ఎక్కువగా వచ్చాయి. చాయ్‌ వాలా నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడి బయోపిక్‌ రూపొందనుంది. గతంలో మోడి బయోపిక్‌లో పరేష్‌రావల్‌, అనుపమ్‌ ఖేర్‌ నటిస్తారనే వార్తలు వినపడ్డాయి. అయితే తాజాగా మోడి పాత్రంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తాడని బాలీవుడ్‌లో వార్తలు వినపడుతున్నాయి. స్వచ్ఛ భారత్‌ నేపథ్యంలో 'టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ' చిత్రంలో అకయ్‌ నటించాడు.
ఈ సినిమా కారణంగా అక్షయ్‌ మోడి మనసు గెలిచాడట. అదీ కాక మోడి బయోపిక్‌కు అక్షయ్‌ అయితేనే న్యాయం చేయగలడని చాలా మంది భావిస్తున్నారు. అక్షయ్‌కు మంచి ఇమేజ్‌ ఉంది. తననే మోడి బయోపిక్‌లో తీసుకోవాలని భాజపా ఎం.పి. శతృఘ్నసిన్హా, సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ పహ్లజ్‌ నిహ్లానీలు కూడా అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.