close
Choose your channels

నిఖిల్ పైనే ఆశలన్నీ

Sunday, October 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ప్రేమ‌క‌థా చిత్ర‌మ్' విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది ఎవ‌రంటే.. ఠ‌క్కున వ‌చ్చే స‌మాధానం నందిత‌. అంత‌గా త‌న న‌ట‌న‌తో సినిమాకి జీవాన్నిచ్చింది ఆ అమ్మ‌డు. ఆ సినిమాతో న‌టిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నందిత‌కి ఆ త‌రువాత మాత్రం ఆశించిన విజ‌యాలేమీ రాలేదు. 'రామ్‌లీలా, కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ' చిత్రాలు నిరాశ‌ప‌రిచితే.. వీటికంటే ముందు వ‌చ్చిన‌ ల‌వ‌ర్స్ మాత్రం ఊర‌ట‌నిచ్చింది.

ఈ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ స్థాయి విజ‌యం కోసం అమ్మ‌డు ఆశ‌గా ఎదురుచూస్తోంది. ఈ నేప‌థ్యంలో స్వామి రా..రా.., కార్తీకేయ, సూర్య వెర్స‌స్ సూర్య‌.. ఇలా హ్యాట్రిక్ విజ‌యాల‌తో ఫుల్‌ఫామ్‌లో ఉన్న‌ నిఖిల్‌తో క‌లిసి న‌టిస్తున్న 'శంక‌రాభ‌ర‌ణం' పైనే త‌న ఆశ‌ల‌న్నీ పెట్టుకుంది నందిత‌. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి నిఖిల్ అయినా త‌న ఇన్‌ఫ్లూయిన్స్‌తో నందిత‌కి తిరిగి ఫామ్ అందిస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.