close
Choose your channels

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బన్ని....

Saturday, February 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం చిత్రం డి.జె. దువ్వాడు జగన్నాథమ్`. `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ మహా శివరాత్రి సందర్భంగా విడుదలై ట్రెమెండస్ రెస్పాన్స్ ను రాబట్టుకుంటూ సోష‌ల్ మీడియా ట్రెండ్ సెట్టర్‌గా దూసుకెళ్తోంది.

విడుద‌లై 24 గంట‌లైనా గ‌డ‌వ‌క ముందే టీజ‌ర్ రెండు మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఈ వేసవిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.