close
Choose your channels

బన్నిని అడ్డుకున్న స్థానికులు..

Saturday, February 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం డి.జె. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈరోజు విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

క‌ర్ణాట‌క‌లో షూటింగ్ ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు ఓ డైలాగ్ కూడా లీక్ కావ‌డం ప‌ట్ల యూనిట్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ చేసే ఆల‌యం వైష్ణ‌వాల‌యం అయితే అక్క‌డ శైవానికి సంబంధించిన సెట్ ఎలా వేస్తార‌ని స్థానికులు షూటింగ్‌కు అంత‌రాయం క‌లిగించారు. మరిప్పుడు ఏమ‌వుతుందో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.