close
Choose your channels

అమ్మ పాత్రలో అమీ జాక్సన్?

Friday, November 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విదేశీ సోయ‌గం అమీ జాక్స‌న్.. కేవ‌లం అందాల ఆర‌బోత‌కే కాదు.. అప్పుడ‌ప్పుడు న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు చేస్తుంటుంది. మ‌రోసారి అలాంటి పాత్ర‌లో అమీ క‌నిపించ‌నుంది. ఈ సారి ఏకంగా అమ్మ‌గా క‌నిపించ‌నుంద‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య్ హీరోగా

'రాజా రాణి' ద‌ర్శ‌కుడు అట్లీ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని సినిమాలో అమీ ఫ్లాష్‌బ్యాక్‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ ల‌వ్ ఇంట్ర‌స్ట్‌గా మొద‌ల‌య్యే ఈ క్యారెక్ట‌ర్‌.. అత‌నికి భార్య‌గానూ, ఓ బిడ్డ‌కు త‌ల్లిగానూ కొన‌సాగుతుందట‌. అన్న‌ట్టు.. ఆ బిడ్డ‌గా అంటే అమీకి కూతురుగా క‌నిపించ‌నుంది మ‌రెవ‌రో కాదు మీనా కూతురు నైనికా అట‌. ఈ వార్త‌లో ఏ మేర‌కు నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.