close
Choose your channels

ర‌వితేజ స‌ర‌స‌న బ్రిటిష్ భామ‌

Monday, December 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్` స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌డం లేదు. ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఓ మై ఫ్రెండ్ ఫేమ్` వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అలాగే మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. గ‌తంలో రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డు చిత్రంలో చిన్న పాత్ర‌లో తళుక్కుమ‌న్న ఈ బ్రిటిష్ సుంద‌రాంగి ఇప్పుడు మ‌రోసారి ర‌వితేజ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఎమీ జాక్స‌న్ శంక‌ర్ రోబో సీక్వెల్ 2.0`లో న‌టిస్తుంది. మ‌రి ఎమీజాక్స‌న్‌ను తెలుగు సినిమాలో న‌టించ‌డానికి శంక‌ర్ ఒప్పుకుంటాడో లేదో...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.