close
Choose your channels

అర‌వింద్ స్వామి క‌న్ ఫ‌ర్మ్ అయ్యాడ‌ట‌..

Monday, November 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే త‌ని ఒరువ‌న్ లో విల‌న్ పాత్ర పోషించిన అర‌వింద్ స్వామి పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు పోషిస్తున్నార‌నే విష‌యం పై ఇప్ప‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ నెల‌కొంది.

ఈ పాత్ర కోసం తెలుగు,త‌మిళ‌,హిందీ న‌టుల పేర్లు ప‌రిశీలించారు. ఫైన‌ల్ గా త‌ని ఒరువ‌న్ లో న‌టించిన‌ అర‌వింద్ స్వామే తెలుగులో కూడా విల‌న్గా న‌టిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాకు గాను అర‌వింద్ స్వామికి అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ట‌. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.