close
Choose your channels

భాగమతి కథ అది కాదు..

Monday, May 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెంగుళూరు భామ (అనుష్క) భాగ‌మ‌తిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. హైద‌రాబాద్ ని ప‌రిపాలించిన‌ మ‌హ‌మ్మద్ కులికుతుబ్ షా, భాగ‌మ‌తి ల ప్రేమ‌క‌థ ఓ చ‌రిత్ర‌. అయితే..డైరెక్ట‌ర్ అశోక్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో భాగ‌మ‌తి టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేయ‌గానే అంద‌రూ చారిత్రాత్మ‌క చిత్రం అనుకున్నారు. కానీ...అశోక్ చ‌రిత్ర‌ను ట‌చ్ చేయ‌డం లేద‌ట‌.
భాగ‌మ‌తి టైటిల్ తో ఓ థ్రిల్ల‌ర్ మూవీ తీస్తున్నార‌ట‌.మ‌ల‌యాళం న‌టుడు జ‌య‌రామ్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.ఈ భారీ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను జ‌న‌వ‌రి మూడ‌వ వారం నుంచి ప్రారంభించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.