close
Choose your channels

ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువు - బాలకృష్ణ

Monday, October 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉగ్ర‌వాద చొర‌బాటు శిబిరాల‌పై మెరుపుదాడులు చేసి విజ‌యం సాధించిన భారత సైన్యానికి దేశం యావ‌త్తు జై కొడుతుంది. శాంతికి విఘూతం క‌లిగించే అన్ని శ‌క్తుల‌ను తిప్పికొట్ట‌గ‌ల స‌త్తా భార‌త్ కు ఉంది అంటూ ప‌లువురు రాజ‌కీయ నాయ‌క‌లు ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. తాజాగా సీనియ‌ర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఈ విష‌యం పై స్పందించారు.
హైద‌రాబాద్ లో బాల‌కృష్ణ ఈ విష‌యం పై మాట్లాడుతూ.... ఉగ్ర‌వాదులు హ‌ద్దు మీరితే ప్ర‌జ‌లు స‌హించ‌రు. ఉగ్ర‌వాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ర‌క్తానికి జాతి, మాంసానికి మ‌తం, చ‌ర్మానికి కులం లేదు. ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించే మ‌న దేశంలో ప్ర‌జ‌ల‌కు ఓపిక ఉంది. అయినా దేనికైనా ఓ హ‌ద్దు ఉంటుంది. ఉగ్ర‌వాదం ప్ర‌పంచానికి శ‌త్రువుగా మారింది. ఉగ్ర‌వాదులు మాట విన‌క‌పోతే త‌గిన విధంగా బుద్ది చెబుతాం అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.