close
Choose your channels

బాలయ్య సెంచరీ సినిమా ప్రారంభోత్సవం కు భారీ ఏర్పాట్లు..

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వందో సినిమాను ఉగాది రోజున అమ‌రావ‌తిలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క్రిష్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేసారు. అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో బాల‌య్య‌తో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్క్ చేసిన నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పాల్గొంటార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తున్నార‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రారంభించి మే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 10న బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.