close
Choose your channels

అప్పుడే బాల‌య్య రెడీ అవుతున్నాడు...

Thursday, October 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ...గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాపై చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే బాల‌య్య అభిమానులు సంద‌డి చేయ‌డానికి స‌న్నాహాలు చేసేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రారంభం నుండి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించుకుంది.

అయితే బాల‌య్య 100వ సినిమా ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ముందు చాలా ఆస‌క్తి నెల‌కొంది. ఎందుకంటే ఓ వైపు క్రిష్ చెప్పిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో పాటు కృష్ణ‌వంశీ చెప్పిన రైతు క‌థ కూడా బాల‌కృష్ణ‌కు న‌చ్చ‌డంతో బాలకృష్ణ ఏ సినిమా చేస్తారోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ బాల‌య్య చివ‌ర‌కు క్రిష్ చెప్పిన గౌత‌మిపుత్ర శాత‌కర్ణి సినిమా చేయ‌డానికే ఆస‌క్తి చూపారు.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ చెప్పిన రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే రైతు క‌థ కూడా బాల‌య్య‌కు విప‌రీతంగా న‌చ్చ‌డంతో బాల‌య్య రైతు చిత్రాన్ని 101వ చిత్రంగా చేస్తాన‌ని అన్నారు. అన్న మాట ప్ర‌కార‌మే ఇప్పుడు కృష్ణ‌వంశీ త‌న 10వ1వ చిత్రంగా రైతు సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. దీంతో పాటు ప్రీప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను స్టార్ చేయ‌బోతున్నారు. న‌వంబ‌ర్ నెల‌కు బాల‌య్య గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది కాబట్టి డిసెంబ‌ర్‌లోనే బాల‌కృష్ణ రైతు సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.