close
Choose your channels

'రైతు' కోసం బాలయ్య డేరింగ్....

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాధార‌ణంగా సీనియ‌ర్ హీరోస్ అందరూ వారి వ‌య‌సును త‌క్కువ‌గా చూపించుకుంటూ తెర‌పై యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తుంటారు. పాత్ర‌ల కోసం ఏజ్డ్ పాత్ర‌లు చేసే హీరోస్ చాలా త‌క్కువ మంది ఉంటారు. ఈ త‌క్కువ మంది హీరోస్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. పాత్ర న‌చ్చితే దాని కోసం రిస్క్ చేయ‌డానికి బాల‌య్య రెడీ అయిపోతారు. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా త‌ర్వాత రైతు అనే పేరుతో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే 70 సంవ‌త్స‌రాల రైతు పాత్ర‌లో బాల‌కృష్ణ ఈ చిత్రంలో క‌నిపిస్తార‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదో ర‌కంగా బాల‌య్య చేస్తున్న ప్ర‌యోగ‌మ‌నే చెప్పాలి. గ‌తంలో కూడా పెద్ద‌న్న‌య్య‌, అధినాయ‌కుడు సినిమాల్లో బాల‌య్య ఏజ్‌కు పై బ‌డ్డ పాత్ర‌ల్లో క‌న‌ప‌డ్డారు. అలాగే మ‌రోసారి బాల‌య్య సంద‌డి చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌. ఈ సినిమాలో బాల‌య్య గెట‌ప్‌పై ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.