close
Choose your channels

'మన్యం పులి' తర్వాత 'బ్లాక్ మనీ' సెన్సేషన్స్ షురూ..

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ల‌యాళ అనువాద చిత్రం `మ‌న్య ం పులి` తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అందుకే అలాంటి సెన్సేష‌న‌ల్ హిట్‌ తర్వాత మోహ‌న్‌లాల్ నుంచి ఏ సినిమా వ‌స్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్ష‌కుల్లో స‌హ‌జంగా ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మ‌రింత రెయిజ్ చేసేలా, ఆద్యంతం థ్రిల్‌కి గురిచేసే మ‌రో మైండ్ బ్లోవింగ్ మూవీ మోహ‌న్‌లాల్ నుంచి వ‌స్తోంది. ఈ సినిమా టైటిల్ `బ్లాక్‌మ‌నీ`. `.. అన్నీ కొత్త నోట్లే` అన్న‌ది ఉప‌శీర్షిక‌. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈనెల‌లోనే సినిమా రిలీజ్ కానుంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -``మోహ‌న్‌లాల్ న‌టించిన ఈ క్రేజీ సినిమాకి ప్ర‌స్తుతం అనువాదం జ‌రుగుతోంది. వెన్నెల‌కంటి సంభాష‌ణ‌లు అందించారు. ఇప్ప‌టికే సెన్సార్ ప‌నులు సాగుతున్న‌ ఈ చిత్రాన్ని ఈనెల‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. సీనియ‌ర్ దర్శ‌కుడు జోషి ఈ సినిమాని అద్భుత‌మైన గ్రిప్‌తో తెర‌కెక్కించారు. డీమానిటైజేష‌న్ త‌ర్వాత అన్నిచోట్లా బ్లాక్‌మ‌నీ గురించే చ‌ర్చ సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు న‌ల్ల‌దొర‌లు కొత్త క‌రెన్సీతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేప‌థ్య ంలోనే ఈ ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ‌వుతోంది. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ష్యూర్‌షాట్ హిట్‌`` అన్నారు. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న అమ‌లాపాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, డైలాగ్‌కింగ్ సాయికుమార్ విల‌న్‌గా న‌టించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.