close
Choose your channels

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ భామ‌..!

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది.

తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తారు కాబ‌ట్టి ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నార‌ట‌. బాలీవుడ్ భామ ప‌రిణితి చోప్రాతో ఈ మూవీ కోసం సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందే ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.