close
Choose your channels

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'లెజెండ్' 1000 రోజుల పోస్టర్ విడుదల

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్` ఇప్పుడు విజ‌య‌వంతంగా 950 రోజుల‌ను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశ‌గా ప‌య‌నిస్తుంది. 2014, మార్చి 28న విడుద‌లైన `లెజెండ్ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ 55 కోట్ల‌కు పైగా షేర్స్‌ను సాధించింది.

ప్ర‌స్తుతం నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` కోసం అతృత‌గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంలో బాల‌కృష్ణ `లెజెండ్` క‌డ‌ప‌జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా 950 రోజుల‌ను పూర్తి చేసుకుని 1000 రోజుల‌ను పూర్తి చేసుకుంటుండటం విశేషం. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణను ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఆవిష్క‌రించిన తీరు రియ‌ల్లీ సూప‌ర్బ్‌. ఈ శుభ సంద‌ర్భాన అర్చ‌న థియేట‌ర్ ప్రొప్రైట‌ర్ కె.ఓబుల్ రెడ్డి, లెజెండ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటిని క‌లిసి లెజెండ్ 950 నుండి 1000వ రోజు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన `చంద్ర‌ముఖి` 891 రోజుల విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌ప‌డి ద‌క్షిణాది సినిమా చ‌రిత్ర‌లో ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ రికార్డ్‌ను చెరిపేస్తూ నంద‌మూరి బాల‌కృష్ణ లెజెండ్ 1000 రోజులుకు ప‌య‌నిస్తూ సరికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా `లెజెండ్` సినిమాను మెమ‌ర‌బుల్ మూవీగా గుర్తుండిపోయేలా చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు, నంద‌మూరి అభిమానుల‌కు చిత్ర‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత‌లు రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌, సాయికొర్ర‌పాటి స‌హా చిత్ర‌యూనిట్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.