close
Choose your channels

ఊటీలో 'బ్రహ్మోత్సవం'?

Monday, October 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'శ్రీ‌మంతుడు'.. మ‌హేష్‌బాబు కి కొత్త ఉత్సాహాన్నిచ్చిన చిత్ర‌మిది. 80 కోట్ల‌కి పైగా షేర్‌ పొందిన ఈ సినిమా విజ‌యంతో.. మ‌హేష్ త‌న కొత్త చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం'ని మ‌రింత జ‌న‌రంజ‌కంగా అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తున్న ఈ సినిమాలో కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ పూర్త‌వుతుంది. త‌దుప‌రి షెడ్యూల్ న‌వంబ‌ర్ మొద‌టివారం నుంచి ఊటీలో జ‌రుగుతుంద‌న్న‌ది విశ్వ‌స‌నీయ స‌మాచారం. 'బ్ర‌హ్మోత్స‌వం' తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. వేస‌వి కానుక‌గా రిలీజ్ అయ్యే దిశ‌గా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.