close
Choose your channels

ఆకాశంలో ప్రభాస్ భారీ ఫైట్ కి అంత బడ్జెట్టా..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం బాలీవుడ్ భామ ప‌రిణితి చోప్రా ను సంప్ర‌దిస్తున్నారు.
ఇదిలా ఉంటే...ఆ మూవీ కోసం ఆకాశంలో ఓ భారీ ఫైట్ చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ ఫైట్ కోసం హాలీవుడ్ టెక్నిషియ‌న్స్ ను తీసుకుంటున్నార‌ట‌. ఈ ఒక్క ఫైట్ సీన్ కోస‌మే 30 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. ఈ స్టంట్ కోస‌మే 30 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారంటే...ఈ ఫైట్ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ భారీ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో ప్రారంభించనున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.