close
Choose your channels

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు..

Tuesday, July 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైద‌రాబాద్ లోని గ్లిట్ట‌ర్స్ ఫిల్మ్ అకాడ‌మికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు ల‌భించింది.. గ‌త 15 ఏళ్లుగా పిల్మ్, టివి రంగానికి చెందిన ప‌లు విభాగాల‌లో శిక్ష‌ణ ఇస్తున్న ఈ సంస్థ‌ను కేంద్ర ప్ర‌భుత్వ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సంస్థ‌కు అనుబంధంగా ఉన్న మీడియా, స్కిల్ కౌన్సిల్ అధికారికంగా ఈ గ్లిట్ట‌ర్స్ ఫిల్మ్ అకాడ‌మికి గుర్తింపు ఇచ్చింది.. ఈ వివ‌రాల‌ను ఈ అకాడ‌మి కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ అకాడ‌మి ఛైర్మ‌న్ దీప‌క్ బ‌ల‌దేవ్ వెల్ల‌డించారు.. ఈ మీడియా స‌మావేశంలో మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ కౌన్సిల్ సి ఒ ఒ మోహిత్ సోని, మెస్క్ మార్కెటింగ్ హెడ్ సుమీత్ కిర‌ణ్ లు కూడా పాల్గొన్నారు..

ఈ సంద‌ర్భంగా దీప‌క్ బ‌ల‌దేవ్ మాట్లాడుతూ, 15 సంవ‌త్స‌రాలు సీనీ, టి వి రంగాల‌కు చెందిన వివిధ విభాగాల శిక్ష‌ణ ఇస్తున్న త‌మ సంస్థ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం గుర్తించ‌డం వ‌ల్ల సంతోషం వ్య‌క్తం చేశారు.. ఈ గుర్తింపు వ‌ల్ల త‌మ సంస్థ‌లో శిక్ష‌ణ పొందిన విద్యార్ధులు దేశంలోని ఏ కేంద్ర‌, రాష్ర్ట‌, ప్రైవేటు మీడియా, సినీ రంగాల‌లో అతి సుల‌భంగా ఉద్యోగం పొంద‌గ‌లుగుతార‌ని పేర్కొన్నారు.. తాము అందించే స‌ర్టిఫికెట్ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు కూడా ఆమోదిస్తాయిని అన్నారు.

న‌ట‌న‌, డైరెక్ష‌న్, ఎడిటింగ్, లైన్ ప్రొడ‌క్ష‌న్, స్క్రీన్ ప్లే, యాంక‌రింగ్ త‌దిత‌ర విభాగాల‌లో త‌ర‌గతులు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.. మూడు , ఆరు, తొ్మ్మిది నెల‌ల స్వ‌ల్ప‌కాలిక కోర్సులు గా విద్యార్ధుల‌కు శిక్ష‌ణ ఇస్తున్న‌మ‌ని పేర్కొన్నారు.. నామ మాత్ర ఫీజుతో ఉత్త‌మ శిక్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని అన్నారు.. ఈ 15 ఏళ్ల ప్ర‌యాణంలో త‌మ వ‌ద్ద శిక్ష‌ణ పొందిన ఎంద‌రో విద్యార్ధులు దేశంలోని వివిద మీడియాలోనూ, సినిమా రంగంలో ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు.. ఇప్ప‌టికే చాలా మంది ఆయా విభాగాల‌లో పేరు ప్ర‌ఖ్యాతలు పొంద‌డం త‌మ సంస్థ గ‌ర్వించే అంశ‌మ‌ని అన్నారు. ఎంఎస్సీ సర్టిఫికెషన్ కోర్సెస్ ఆగష్టు 6th నుండి అడ్మిషన్స్ ప్రారంభం అవుతాయి త‌మ సంస్థ‌ను కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించ‌డం ప‌ట్ల సంబంధింత శాఖ అధికారుల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.