close
Choose your channels

'చల్ చల్ గుఱ్ఱం' పాటలు విడుదల

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు. శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నటీనటులుగా ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తోన్న చిత్రం ఛల్ ఛల్ గుఱ్ణం`. వెంగి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా పాటల బిగ్ సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. పాటల ఆడియో సీడీలను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి కాపీని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అందుకున్నారు.

ఈ సందర్భంగా....

పాటలు, ట్రైలర్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

నాపై, నా కథపై నమ్మకంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాఘవయ్యగారికి థాంక్స్. మంచి ఎమోషనల్,లవ్, కామెడి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా శైలేష్ రెండో సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడని దర్శకుడు మోహన్ ప్రసాద్ అన్నారు. ఆడియో, సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని నిర్మాత ఎం.రాఘవయ్య చెప్పారు.

అన్నీ వేరియేషన్స్ ఉన్న సాంగ్స్ ఈ చిత్రంలో ఉన్నాయని మ్యూజిక్ డైరెక్టర్ వెంగి అన్నారు. వెంగి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. సినిమా కమర్షియల్ వాల్యూస్ తో విజువల్ గా సినిమా చక్కగా ఉంటుందని హీరో శైలేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: రఘు, ప్రదీప్, అంథోని, భాను, ఎడిటింగ్: శంకర్, ఫైట్స్: రాం సుంకర, ఆర్ట్: జె.కె.మూర్తి, మ్యూజిక్: వెంగి, నిర్మాత: ఎం.రాఘవయ్య, దర్శకత్వం: మోహన ప్రసాద్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.