1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

విశ్వరూపం 2 తక్కువట!

IndiaGlitz [Saturday, November 23, 2013]
Comments

లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడుగా రూపొందిన చిత్రం 'విశ్వరూపం'. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది.  ఈ సినిమాకి సీక్వెల్ గా  'విశ్వరూపం 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కమల్ హాసన్ తో కలిసి నటించిన పూజా కుమార్, ఆండ్రియాలు ఈ సినిమాలోనూ కనిపించనున్నారు. ఈ సినిమా సాంకేతికంగానూ అలరించేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం 'విశ్వరూపం 2' నిడివి తక్కువేనని తెలుస్తోంది. 'విశ్వరూపం' చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉంటే. 'విశ్వరూపం 2' మాత్రం 2 గంటల కంటే తక్కువే ఉందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.  తొలి భాగంతో ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలు పొందిన కమల్.. రెండో భాగంతోనూ దాన్ని కొనసాగిస్తాడని చిత్ర బృందం పేర్కొంటోంది. వచ్చే నెలలో గానీ జనవరిలో గానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
Sunny Leone steps into K Town

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.