1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాండవులు పాండవులు తుమ్మెద లాగే

IndiaGlitz [Thursday, November 28, 2013]
Comments

మంచు కుటుంబంలోని కథానాయకులైన మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. వరుణ్ సందేశ్, తనీష్ మరో రెండు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో.. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి, మణిశర్మ, బప్పాల హరి, బాబా సెహగల్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ ఐదుగురు అన్నదమ్ములుగా నటిస్తున్నారని సమాచారం.  విశేషమేమిటంటే.. తెలుగులో ఐదుగురు అన్నదమ్ముల కథగా 'పాండవులు..' సంక్రాంతికి రానుంటే.. అచ్చంగా తమిళంలోనూ ఇలాగే అజిత్, తమన్నా జంటగా నటిస్తున్న ఐదుగురు అన్నదమ్ముల కథ 'వీరమ్' కూడా సంక్రాంతికి విడుదల కాబోతుండడం. మరి ఏ ఐదుగురు అన్నదమ్ముల కథకి ఆదరణ దక్కుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Will Powerstar be part of Shankars Ai?Other News


The Multitasker Dhanush

Arvind Swamy in Mahesh Manjrekars next?

Happy Birthday Udhayanidhi Stalin!

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.