1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరుత తరువాత

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా. 'చిరుత'తో కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు రామ్ చరణ్. ఆ తరువాత వచ్చిన రెండో సినిమా అయిన 'మగధీర'తో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆనక 'రచ్చ, నాయక్' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ యువ హీరో అతి త్వరలో 'ఎవడు' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ చిత్రం తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.ఈ చిత్రం కోసం చెర్రీతో ఓ కొత్త నాయిక జోడీ కట్టనుందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన 'చిరుత' కోసం నేహా శర్మ అనే కొత్త హీరోయిన్ తో జతకట్టిన చరణ్. ఆ చిత్రం తరువాత   మరే సినిమాలోనూ కొత్త హీరోయిన్ తో  జట్టుకట్టని చెర్రీ. చాన్నాళ్ల తరువాత కొత్తమ్మాయితో కలిసి నటించనుండడం అనే అంశం ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నూతన నాయిక ఎవరో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.




Assuming dual roles Carnatic Musician and Playback Singer





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.