1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నానికి ఫస్ట్ టైమ్

IndiaGlitz [Sunday, December 01, 2013]
Comments

చిన్న చిత్రాలతో కెరీర్ ని మొదలు పెట్టిన నాని.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందాడు. 'అష్టాచమ్మా, రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ'.. ఇలా తన కెరీర్ లో సింహ భాగం విజయాలను నమోదు చేసుకున్న ఈ యువ కథానాయకుడు బాగానే సక్సెస్ గ్రాఫ్ ని కొనసాగిస్తున్నాడు.

సినిమాల ఎంపికలో సెలెక్టివ్ గా ఉండే నాని.. రాశి కంటే వాసికే ప్రాధాన్యత ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అలాంటి నాని నుంచి ఈ నెలలోనే రాబోతున్న సినిమా 'పైసా'. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత కొంత కాలంగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ వాయిదా పద్ధతి వల్ల నానికి ఓ కొత్త అనుభవం ఎదురైనట్లయ్యింది. అదేమిటంటే.. హీరోగా కెరీర్ ని మొదలెట్టాక.. సినిమా సినిమాకి  రిలీజ్ విషయంలో ఏనాడు సంవత్సరం గ్యాప్ తీసుకోని వైనం ఉన్న అతడికి.. మొదటి సారి అలాంటి పరిస్థితి ఎదురవుతోంది.

నాని గత చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' గతేడాది డిసెంబర్ 14న విడుదలైతే.. కాస్త అటు ఇటుగా అదే డిసెంబర్ కి నాని తాజా చిత్రం 'పైసా' రిలీజవుతోంది. దీంతో ఏడాది గ్యాప్ తరువాత నాని తన అభిమానులను, ప్రేక్షకులను పలకరించినట్లయ్యింది. విడుదల విషయంలో ఆలస్యం జరిగినా.. ఫలితంతో నాని ఆకట్టుకుంటాడని చిత్రయూనిట్ వర్గాలు  నమ్మకంగా చెప్పుకొస్తున్నాయి.Other News


Sravanthi Movies Join Hands With Reliance Entertainment

Golden Jubilee Choreographer Raghuram Is No More

Autonagar Surya Completes Shooting

DK Bose To Come In The First Half Of December

Vidiyum Munn User ReviewMore News


Rey To Come On The 5th February

ఆటోనగర్ సూర్య షూటింగ్ పూర్తీ

Adee Lekka Ready For December Release

Denikaina Ready Producer Wins Court Case Against Brahmin Associations

జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తి

ప్రేమ ఇష్క్ కు ఎ సర్టిఫికేట్

నువ్వే నా బంగారం పాటలు విడుదల

యూత్ ఫుల్ లవ్ ఆడియో విడుదలCopyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sravanthi Movies Join Hands With Reliance Entertainment
 Golden Jubilee Choreographer Raghuram Is No More
 Autonagar Surya Completes Shooting
 DK Bose To Come In The First Half Of December
 Rey To Come On The 5th February
 ఆటోనగర్ సూర్య షూటింగ్ పూర్తీ
 Adee Lekka Ready For December Release
 Denikaina Ready Producer Wins Court Case Against Brahmin Associations
 జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తి
 ప్రేమ ఇష్క్ కు ఎ సర్టిఫికేట్
 నువ్వే నా బంగారం పాటలు విడుదల
 యూత్ ఫుల్ లవ్ ఆడియో విడుదల

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.