1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నిత్య ప్రేమలో ఓడిందా?

IndiaGlitz [Tuesday, December 24, 2013]
Comments

నిత్యమీనన్ పేరు చెప్పగానే పద్ధతిగా కనిపించే పక్కింటి అమ్మాయి గుర్తుకొస్తుంది. అలా మొదలైంది మొదలు ఆమె చేసింది నాలుగైదు సినిమాలే అయినా నిత్య మంచి పేరు తచ్చుకుంది. ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడటమే అందుకు సగం కారణం. ఏదేమైనా నిత్యమీనన్ ఇటీవల తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఆమె కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడిందట.

దీని గురించి నిత్య మాట్లాడుతూ "తొలి ప్రేమను మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. మనల్ని మనం బిజీ చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. నా 18 ఏళ్ల ప్రాయంలోనేను ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డాను. దాదాపు నాలుగేళ్లు మా ఇద్దరి మధ్య బాగా ప్రేమ నడిచింది. కానీ ఒకరోజు తను నాకు కరెక్ట్ కాదనిపించింది. ఇదేదో సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. బాగా ఆలోచించి, అతన్ని దగ్గరి నుంచి గమనించి తీసుకున్న నిర్ణయం.

అందుకే అతనికి దూరంగా ఉండసాగాను. నాలుగేళ్లు ఒకరిని ప్రేమించి సడన్ గా దూరమవడం తేలికైన విషయం కాదు. కానీ నాకు తప్పలేదు. భగవంతుడి దయవల్ల అప్పుడే నాకు నందినిరెడ్డి నుంచి అలా మొదలైంది ఆఫర్ వచ్చింది. నా కోపాన్నంతా పక్కన పెట్టేశాను. బాధ నుంచి దూరం జరగాలని నిర్ణయించుకున్నాను. వెంటనే తెలుగు నేర్చుకున్నాను. సో నెగటివ్ లోనూ నాకు పాజిటివ్ జరిగింది" అని వివరించింది. నిత్య ప్రస్తుతం 22,మాలిని, ముని-3లో నటిస్తోంది.
Pizza Goes to Hollywood

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Venky To Play God In The Remake Of 'OMG Oh My God'
 'Uyyala Jampala' Is A Good Film: Nagarjuna
 'D for Dopidi': All Set to Entertain Over Holidays in USA
 Ilaya Raja Hospitalized But Stable
 Mohan Babu RGV Movie Ottu Shooting From 26th December
 HC Orders Return Of Padma Awards From Mohan Babu & Brahmanandam
 AMAT Shortlisted for Screening at IIFFSA Film Festival
 I Am Your Son Embrace Me: Sunil
 RGV Raja Sekhar Patta Pagalu
 One Dies In A Stampede At Bheemavaram Bullodu Audio Launch
 2014లో రెహ్మన్ సినిమా
 1 Nenokkadine Creating New Benchmarks In Audio Sales
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.