1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'ప్యార్ మే పడిపోయానే'. ఆది, శాన్వి హీరోహరోయిన్లు. కె.కె.రాధామోహన్ నిర్మాత. రవిచావలి దర్శకుడు. ఈ సినిమా 90% టాకీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ 'డిసెంబర్ 16నుండి ఈనెల 8 వరకు జరిగిన రెండో షెడ్యూల్ తో 90 శాతం టాకీ పూర్తైంది. పాటలు, కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెల చివరి వారంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తాం' అని అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ  'రవి చావలి డిపెరెంట్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్నారు. ప్రేమకావాలి, లవ్ లీ, తర్వాత ఈ సినిమా మరో హిట్ మూవీ అవుతుంది. శాన్వితో రెండోసారి జత కడుతున్నాను. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్టవుతుంది' అని అన్నారు. ఆది, శాన్విలతో పాటు వెన్నెలకిషోర్, కాశీవిశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరాః టి.సురేంద్రరెడ్డి, సంగీతం: అనూప్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతః ఎమ్మెస్ కుమార్, నిర్మాతః కె.కె.రాధామోహన్, రచన, దర్శకత్వం: రవిచావలి
Vani Learns Tamil and Telugu

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.