1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రతిఘటన టీజర్ రివ్యూ

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

ఛార్మి ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'ప్రతిఘటన'. రేష్మా, రఘబాబు తదితరులు ఇందులో కీలకపాత్రధారులు. ఇవాళ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రంగా వస్తున్న ఈ సినిమా టీజర్ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. టీజర్ నిడివి 53 సెకన్లు. చరిత చిత్ర బ్యానర్ లో సినిమా రూపొందుతుంది. 'యత్ర నార్యంతు పూజ్యంతే రమంతు తత్ర  దేవతాః' అనే వ్రైటప్ తో టీజర్ ప్రారంభమైంది.

ఇందులో ఛార్మి జర్నలిస్ట్ గా నటిస్తుంది. ఈ టీజర్ లో ఛార్మి మాత్రమే ఎలివేట్ అయ్యింది. 'మహిళలపై  అత్యాచారం చేయాలంటే గుండె ఆగిపోవాలి. ఇలాంటి ప్రతి ఘటనకి ఈ ప్రతిఘటన ఒక నాంది కావాలి..' అంటూ ఛార్మి చెప్పే డైలాగ్ హైటైట్ అయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే మహిళలపై నేటి సమాజంలో జరుగుతున్న అత్యాచారాలపై ఎక్కుపెట్టిన బాణంలా ఈ సినిమా వస్తుందనిపిస్తుంది...ఆల్ ది బెస్ట్ టు 'ప్రతిఘటన' టీమ్

Watch Prathigatana Trailer
Vishal film most likely on Tamil New YearOther News


Suriya to have a release with Vishal

Kangaroo will change Saamis image Vairamuthu

Sudeep is Rajnis Villain

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.