1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

యమలీల2 లో సదా

IndiaGlitz [Wednesday, March 12, 2014]
Comments

'జయం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సొగసరి సదా. తర్వాత వరుస విజయాలతో దూసుకొచ్చింది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన 'అపరిచితుడు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇప్పుడు అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతుంది. 2012లో తెలుగులో నటించిన 'మైత్రి' తర్వాత తెలుగు తెరపై కనపడలేదు.

ఇప్పుడు తాజాగా యస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కునున్న 'యమలీల' సీక్వెల్ 'యమలీల-2'లో నటించడానికి సిద్ధమవుతుందట. 1994లో ఆలీ, ఇంద్రజ, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా విడుదలైన 'యమలీల' ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో మనందరికి తెలిసింది.

ఇప్పుడు ఈ సీక్వెల్ లో యముడు పాత్రధారిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడు. మరి ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.చాలా కాలం సరైన హిట్ లేక సినీ రంగానికి దూరమైన సదా ఈ చిత్రంపై చాలా ఆశలనే పెట్టుకుందట మరి!
Shreya Ghoshal turns 30 today

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.