Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

హ్యాపీ బర్త్ డే బాలు

IndiaGlitz [Wednesday, June 04, 2014]
Comments

యస్.పి.బాలసుబ్రమణ్యం తన స్వర మాధుర్యంతో తెలుగు సినీ వినీలాకాశాన్ని మైమరపించిన స్వర బ్రహ్మ. బాలు గురించి తెలియని తెలుగువాడుండంటే అతిశయోక్తి కాదు. అయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. దక్షిణాది సినిమాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న గాన గంధర్వుడు.

శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లోను తన ప్రతిభను నిరూపించుకున్నారు. మరి ఇతర గాయకులకు రాని గుర్తింపు బాలుకే ఎందుకు వచ్చిందనే సందేహం కలగక మానదు. దీనికి సమాధానమే ఆయన స్వరం.

నటుడికి తగిన విధంగా గొంతు మార్చి పాటకి పట్టం కట్టడం ఆయనకే చెల్లింది. మూడు తరాల తెలుగు నటులకు తన గాత్ర దానంతో ప్రాణం పోశారు. తన తరువాత తరం గాయకులెందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అంతే కాకుండా ఎక్కువ పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

ఆరుసార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్న యస్.పి.బి. అనేక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత సారథ్యంలో బాలసుబ్రమణ్యం అనేక హిట్ సాంగ్స్ పాడారు.

గొప్ప గాయకుడే కాకుండా మంచి సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టివీ వ్యాఖ్యాతగా తన బహుముఖ ప్రతిభను నిరూపించుకున్న ప్రతిభాశాలి బాలసుబ్రమణ్యంకి ఈరోజు జన్మదినం. ఈ సందర్భంగా ఇండియాగ్లిజ్డ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తుంది. ...హ్యపీ బర్త్ డే టు బాలసుబ్రమణ్యం...




పేరు రాతను మార్చుతుందా..?






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Naga Chaitanya's 'Dohchay' first song
 Radhika Apte's sensational comments on Tollywood
 'Uttama Villain' Telugu audio launch today
 'Red Alert' movie producer passes away
 James Bond 'Spectre' Teaser Trailer Hits Online
 Don't worry Radhika, no one cares about you
 Shruti Haasan denies receiving any legal notice
 Steven Spielberg To Direct Sci-Fi Favorite 'Ready Player One'
 Sai Dharam Tej using Chiranjeevi's title
 Ram Charan Birthday Posters

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.