Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

బాలయ్యతో ఫైట్స్ చేయిస్తున్న మనోజ్

IndiaGlitz [Monday, April 30, 2012]

మంచు మనోజ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఊ కొడతారా..ఉలిక్కి పడతారా'. బాలకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శేఖర్ రాజా దర్శకుడు. దీక్షాసేథ్, పంచిబొరా కథానాయికలు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఆమె మాట్లాడుతూపాటలను, ఫస్ట్ లుక్‌ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందరికీ నచ్చుతాయనే నమ్మకం ఉంది

బాలకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేకాకర్షణగా వుంటుంది. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్‌తో ఈ చిత్రం 90 శాతం పూర్తయ్యింది. మేలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అని లక్ష్మీ తెలిపారు. ఈ చిత్రం కోసం ఇటీవల కేరళలోని పలు అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించారు. డాన్స్‌మాస్టర్ బృందా ఆధ్వర్యంలో ఈ పాటల చిత్రీకరణ జరిగిందని మనోజ్ చెబుతూ -'కేరళలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంది.

పాటలు కనువిందుగా ఉంటాయి అన్నారు. ఇదిలా ఉంటే.. మనోజ్‌లో మంచి నటుడు మాత్రమే కాదు.. స్టంట్ డెరైక్టర్ కూడా ఉన్నారు. 'మిస్టర్ నూకయ్య'లోని ఫైట్స్‌ని తనే సమకూర్చారు.ప్రస్తుతం రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కిపడతారా లోని బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్‌కి మనోజ్ స్టంట్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. బాలయ్యపై ఫైట్‌ని తను సమకూర్చడం ఎక్సయిట్‌మెంట్‌కి గురి చేసిందని ఈ సందర్భంగా మనోజ్ చెప్పారు.నవ్యమైన కథ, కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. మనోజ్, బాలకృష్ణ పాత్ర చిత్రణ సరికొత్త తరహాలో వుంటాయి. బా తొంభైశాతం చిత్రీకరణ పూర్తయింది. మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.



 యూత్ ని ఆకట్టుకునే 'ఒక్కడినే'



Other NEws

యూత్ ని ఆకట్టుకునే 'ఒక్కడినే'

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Chiranjeevi's son-in-law meets Narendra Modi
 Anurag Kashyap praises Rajamouli's son
 Mohan Babu romancing in Italy
 Veteran art director Kaladhar passes away
 Happy ending for Ileana
 'Iddhrammailatho' post-poned to May 31st
 Doctorate for Comedian Ali
 'Ramayya Vasthavayya' shooting completed at RFC
 'Pushpaka Vimanam' for Shangai film festival
 Sneha shifts to production !
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.