Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'ఆ క్రెడిట్ రామ్-లక్ష్మణ్ లదే'

IndiaGlitz [Monday, April 30, 2012]
Comments

లవ్ లీ చిత్రం యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన లభిస్తోందని దర్శకులు బి జయ అన్నారు. మొదటి చిత్రం 'చంటిగాడు' నుంచి 'లవ్ లీ' వరకు నేను దర్శకత్వం వహించిన చిత్రాలకు రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేశారు. వారిని తప్ప నా సినిమాలకు మరొక ఫైట్ మాస్టర్ని ఊహించలేను. వర్క్ పట్ల నిబద్దత గల వ్యక్తులు వీళ్లు. 'లవ్ లీ'లో కథానుసారం యాక్షన్ దృశ్యాల్ని చక్కగా కంపోజ్ చేశారు.

వాటికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆది ఫైట్స్ సూపర్ అంటున్నారంటే ఆ క్రెడిట్ రామ్-లక్ష్మణ్ లదే అన్నారు బి. జయ. ఆమె దర్శకత్వంలో ఆది, శాన్వీ జంటగా రూపొందిన చిత్రం 'లవ్ లీ'. ఆర్.జె. సినిమా పతాకంపై బి.ఎ. రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ 'చంటిగాడు' సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'లవ్ లీ' వరకు జయగారి చిత్రాలన్నింటికి మేమే ఫైట్స్ కంపోజ్ చేశాం. 'లవ్ లీ' లో మూడు ఫైట్లు కంపోజ్ చేశాం. అందులో క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా వుందని అంతా అంటుంటే ఆనందంగా వుంది.

అలాగే ఛేజ్ సీన్లలో ఎంటర్ టైన్ మెంట్ ని మిళితం చేసి అవి చక్కగా కుదరడానికి దర్శకురాలు జయ చక్కని సహకారాన్ని అందించారు. ఆమె దర్శకురాలిగా మరిన్ని విజయాలు సాధించాలి అన్నారు. బి.ఎ. రాజు మాట్లాడుతూ అనూప్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ఎంత ప్లస్ అయ్యిందో రామ్-లక్ష్మణ్ అందించిన యాక్షన్ సన్నివేశాలు కూడా అంతే ప్లస్ అయ్యాయి  అన్నారు.




బాలయ్యతో ఫైట్స్ చేయిస్తున్న మనోజ్



Other NEws

బాలయ్యతో ఫైట్స్ చేయిస్తున్న మనోజ్

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 నందగోపాల్ కి సన్మానం
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to S.Janaki
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 "Chandamama Kathalu" team launches android app
 ఫిల్మ్ సిటీలో 'మంత్ర2'
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 27న 'ఉహలు గుసగుసలాడే' ఆడియో
 రెగ్యులర్ షూటింగ్ లో సుమంత్
 హిందీలో భారీ ధరకు 'రేసుగుర్రం'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.