Follow us on
 
 
  1. Hollywood
  2. Hindi
  3. Tamil
  4. Telugu
  5. Malayalam
  6. Kannada

రవితేజ మార్కెట్ కి పరీక్ష

IndiaGlitz [Monday, April 30, 2012]

2009లో వచ్చిన 'కిక్' తర్వాత రవితేజ కెరీర్ కి ఆ స్థాయి కిక్ ఇచ్చిన సినిమా మళ్లీ రాలేదు. మధ్యలో 'డాన్ శీను', 'మిరపకాయ్' సినిమాలకు హిట్ టాక్ వచ్చినా వాటికి వచ్చిన లాభాలు చెప్పుకోదగ్గవి కావు. 'ఆంజనేయులు', 'శంభో శివశంభో', 'దొంగల ముఠా', 'వీర', 'నిప్పు' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. ఈ నేపథ్యంలో 'దరువు' సినిమా కచ్చితంగా హిట్టవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రవితేజ మునుపటి సినిమా 'నిప్పు' డిజాస్టర్ కావడంతో 'దరువు'కు ఆశించిన బిజినెస్ కాకపోవడం దాని నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను కాస్త ఇరకాటంలో పెట్టిన మాట నిజం. ఫుల్ మాస్ మసాలా సినిమాగా తయారైన ఈ సినిమాకి ఆయన భారీ స్థాయిలో ఖర్చుపెట్టారు. 'శౌర్యం', 'శంఖం' సినిమాల దర్శకుడు శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోలో హీరోయిన్ గా ఇంతదాకా సక్సెస్ చూడని తాప్సీ నాయిక.

విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చిన పాటలు మార్కెట్లో విడుదలయ్యాక అవి ఆయనే మ్యూజిక్ ఇచ్చిన తమిళ సినిమా 'వేలాయుధం' పాటల్ని జ్ఞాపకం చేస్తున్నాయనే పేరు వచ్చింది. ఈ సినిమా ఆడే తీరుపైనే భవిష్యత్తులో రవితేజ మార్కెట్ స్థాయి ఆధారపడి ఉంది.



 నవదీప్ కు ఇంకో సినిమా వచ్చింది



Other NEws

నవదీప్ కు ఇంకో సినిమా వచ్చింది

Read More »



Copyright 2013 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mohan Babu romancing in Italy
 Happy ending for Ileana
 Doctorate for Comedian Ali
 'Pushpaka Vimanam' for Shangai film festival
 Greeku Veerudu US 3rd Week Schedules
 'Thyagaraju's songs recording
 'Anthaku Mundhu Aa Tharuvatha' audio on May 25th
 Iddarammayilatho One week to GO!
 M.M.Keeravani for Nayanathara's 'Anamika'
 Gopichand's 'Sahasam' audio next week
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2013 IndiaGlitz.com. All rights reserved.