1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రివ్యూ: పీపుల్స్ వార్

IndiaGlitz [Monday, April 30, 2012]
Comments

స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నిర్మించిన చిత్రం 'పీపుల్స్ వార్'. సమకాలీన సమస్యల్ని ఇతివృత్తాలుగా ఎంచుకొని సినిమాలు తీసే ఆయన ఈసారి సోంపేట ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తీయడం గమనించదగ్గ అంశం.ఈ సినిమాకి సంబంధించిన విశేషం ఇందులో నారాయణమూర్తి కొడుకులుగా శ్రీహరి, పోసాని కృష్ణమురళి నటించడం. ఇందులో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండీ, దానికి రాజీనామా చేసి, ఉద్యమ అమరుల ఆశయాల కోసం పోరాడే పాత్ర చేశా. నా కుమారులుగా శ్రీహరి, పోసాని గొప్పగా నటించారు. శ్రీహరి హీరోగా, పోసాని విలన్‌గా కనిపిస్తారు" అని చెప్పారు నారాయణమూర్తి.

తెలంగాణ ఉద్యమం తర్వాత మన రాష్ట్రంలో మహోధృతంగా జరుగుతున్నది సోంపేట, కాకరాపల్లి, కురుపాం ప్రాంతాల్లో జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్స్ వ్యతిరేకోద్యమం. ఈ ఉద్యమం కారణంగా సోంపేటలో ముగ్గురు, కాకరాపల్లిలో ముగ్గురు అమరులయ్యారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల పర్యావరణం, భూగర్భజలాలు విషతుల్యమవుతాయి. మినిమిటా అనే వ్యాధి సోకి జనం చనిపోయే అవకాశాలున్నాయి. మొత్తంగా అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుంది.

అందువల్ల పవర్ ప్లాంట్స్‌కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన 1107 (సోంపేట), 1108 (కాకరాపల్లి) జీవోలను రద్దుచేయాలనీ, ప్రజల మనోభీష్టాల్ని గౌరవించాలనీ ఈ చిత్రం ద్వారా నారాయణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సినిమా 2012 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

శ్రీహరి సరసన తాన్వి నాయికగా నటించిన ఈ చిత్రానికి పాటలు: అల్లం వీరన్న, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్, బారువ కాళీదాస్, ధర్మవరం వెంకటరమణ, కోవిరె వెంకన్న, ఛాయాగ్రహణం: విజయకుమార్, కూర్పు: రాజా, పైట్స్: డ్రాగన్ ప్రకాశ్, కథ, చిత్రానువాదం, మాటలు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.
Arya in Varuthapadadha Vaalibar Sangam?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Suriya & 500 dancers shake a leg in Jodhpur
 Oo Kodatara Ulikkipadatara to release in May
 Chiru to hold reception for fans on Jun 15
 Karthika makes a voluptuous comeback
 The Ee Rozullo Revolution
 RavitejaPuris DCM Logo
 Dammu notice to ISPs
 Amala Pauls natural image
 Shruti Hassan may act in Kandireega2
 Happy Birthday Samantha
 Puri on dot again with DCM
 Balayya to terrorise six villains in Srimannarayana
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.