1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జైలుకు అంజలి

IndiaGlitz [Thursday, September 12, 2013]
Comments

సీతమ్మ అనే పేరు పెట్టుకోవడానికే తెలుగువాళ్లు భయపడుతుంటారు.  శ్రీరామరాజ్యంలో సీతగా నటించిన నయనతార ప్రభుదేవాతో విడిపోయింది. ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీతగా నటించిన అంజలికి మరో రకం ఇబ్బంది ఎదురైంది. తమిళ సినీ దర్శకుడు కళంజియం అంజలిపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని చెన్నై సైదాపేట కోర్టు  అంజలికి నోటీసులను జారీ చేసింది. కానీ పలుమార్లు అంజలి హాజరు కాకపోవడంతో ఈసారి అరెస్టు వారెంట్ ఇచ్చింది.
 
నిజానికి గతంలోనే అంజలి  కోర్టుకు హాజరు కావాల్సింది. కానీ ఆమె కాకపోవటంతో ఆమెకు కోర్టు నాలుగైదు సార్లు  అవకాశం ఇచ్చింది.అయినా హాజరు కాలేదు. దాంతో ఈ సారి కనుక  విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది.అంజలి కోర్టుకు మళ్లీ కోర్టుకు డుమ్మా కొట్టింది. అంజలికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషనర్ కళంజియమ్ కూడా కోర్టును కోరారు. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.
 
అంజలి తీరుపై ఇటీవలే మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి అంజలి కనిపించడం లేదని ఏప్రిల్ 8న ఆమె పిన్ని భారతీ దేవి మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.  దీంతో స్పందించిన కోర్టు అంజలిని తమ ముందు హాజరుపర్చాలని చెన్నై పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.



Karthik Returns with Dhanush



Other News


Mohanlal ill Jilla Schedule Altered

Guess The Movie

Kamal Haasan to be honoured at the 15th Mumbai Film Festival





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Sai Dharam Tej's 'Thikka' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.