1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రౌడీతో సమంత రొమాన్స్

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

అవును. మీరు చదివింది కరెక్టే. సమంత రౌడీతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆ రౌడీ.. రియల్ లైఫ్ కి సంబంధించి మాత్రం కాదులెండి. రీల్ లైఫ్ రౌడీతో జతకట్టి తెర పై సరసాలాడేందుకు  సమంత రెడీ అవుతోంది. కాస్తంత వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సమంత ఒప్పుకున్న తెలుగు సినిమాలన్నీ దాదాపుగా తుదిదశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ తరువాత ఈ ముద్దుగుమ్మ తన దృష్టంతా తమిళ సినిమాల పై కేంద్రీకరించనుంది. అందులో భాగంగా విజయ్ తో ఓ సినిమా.. సూర్యతో ఓ సినిమా చేసేందుకు సమంత కాల్షీట్లు సమర్పించిందని చెన్నై వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సూర్యతో చేయనున్న చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకే 'రౌడీ' అనే పేరు అక్కడ తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 'రౌడీ'తో సమంత రొమాన్స్ అంటూ అక్కడి మీడియాలో శీర్షికల వరద మొదలైంది.

అయితే ఇది అధికారంగా మాత్రం చిత్రయూనిట్ నుంచి వచ్చిన టైటిల్ అయితే కాదని తెలిసింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించనున్నారు. విజయ్ తో సమంత జతకట్టే సినిమాకి మురుగదాస్ దర్శకుడు. ఈ రెండు సినిమాలు డిసెంబర్ తరువాతే సెట్స్ పైకి వెళతాయని తమిళ తంబిలు చెబుతున్నారు.
Arrambam Audio Launch

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Mani Sharma To Rock London
 SIIMA Day 1 Winners List
 Ramoji Rao All Praise For 'Bahubali' Director Rajamouli
 'Manasunu Maya Seyake' In Sound Mixing
 Nenu Naa Friends With Debutant Director
 Prema Katha Chitram Completes 100 Days
 PawanTrivikram To Produce Movies?
 Waiting For That Elusive Success: Sairam Shankar
 Breakup To Hit Screens On The 20th September
 Bikini Rumors Hurt Me: Samantha
 Valayam The Circle Of Mystery around a Murder
 Potugadu US Schedules
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.