Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కార్తీ, కేథరిన్ ల టైటిల్ మారిందా?

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

తమిళ యువ కథానాయకుడు కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కనున్న ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కాళి అనే టైటిల్ ని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. మూడు దశాబ్దాల క్రితం విడుదలై విజయం సాధించిన రజనీకాంత్ కాళి టైటిల్ నే ఈ సినిమాకీ యూనిట్ యోచించింది. అయితే ఇప్పుడు మళ్లీ టైటిల్ ని మార్చాలనుకుంటున్నారని వినిపిస్తోంది.

ఇలా టైటిల్ మార్పు వెనుక ఓ కారణం ఉందని చెన్నై వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అదేమిటంటే.. కాళి, భద్రకాళి.. ఇలా కాళి అనేది టైటిల్ లో గల సినిమాలకి నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఊహించని విధంగా ఏవో ప్రమాదాలు జరిగాయని.. వాటిని దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం టైటిల్ ని మార్చుకోవాలనుకుంటున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. 2014 సమ్మర్ లో విడుదల కానున్న ఈ సినిమాలో కార్తీ స్లమ్ బాయ్ గా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు.




సీతమ్మలో లేనిది రామయ్యాలో..





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Rajamouli's brother to work with Naga Shourya
 'Thanu Nenu Mohammad Rafi' censor completed
 Google's tribute to NTR
 Photo feature : Mahesh Babu at Gautam's school
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
 'Gopala Gopala' New Poster
 Akhil- V.V.Vinayak film regular shoot from
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.