1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రారంభమైన తమాషా

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

శ్రీ జ్యోతి ప్రసన్న మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'తమాషా'. శ్రీ, నీలమ్ ఉపాధ్యాయ, సునీత మార్షియా హీరో హీరోయిన్లు. ఎమ్.విజయవర్ధనరావు, శివారెడ్డి నీలపు నిర్మాతలు. శ్రీనివాస్ బల్లా దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శనివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ నివ్వగా, రమణ గోగుల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...

నిర్మాతలు మాట్లాడుతూ' ఇది మా మొదటి ప్రయత్నం. మూడు పాత్రల ఆధారంగా సినిమా ఉంటుంది.  దర్శకుడు సిద్ధిక్ దగ్గర పనిచేశాడు. సినిమాలో కామెడీతో పాటు సీరియెస్ నెస్ ఉంటుంది'. అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ' సిద్దిక్ గారి వలనే నేనిప్పుడు దర్శకుడిగా మారాను. నిర్మాతలకు పరిశ్రమ అంటే అవగాహనతోనే సినిమా చేస్తున్నారు. ఈ నెల 20 నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. తర్వాత రెండవ షెడ్యూల్ ను విశాఖపట్నంలో చిత్రీకరిస్తాం. సినిమాను ఫిభ్రవరిలోగానీ, మార్చిలోగానీ విడుదల చేస్తాం' అని తెలిపారు.

ఈ సినిమాలో షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, రవిప్రకాష్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతంః రఘురామ్, కెమెరాః పూర్ణ, నిర్మాతలుః ఎమ్.విజయవర్ధనరావు, శివారెడ్డి నీలాపు, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంః శ్రీనివాస్ బల్లా.Other News


Palnadu Gave Me A Good Start As A Producer: Vishal

This Friday Disappoints

Tamasha Film With Sri As Hero Takes Off

MAA Mourns AVS

Nazriya Dulquer Salman Go on the Floors in Munnar

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Palnadu Gave Me A Good Start As A Producer: Vishal
 This Friday Disappoints
 Tamasha Film With Sri As Hero Takes Off
 MAA Mourns AVS
 Arvind Krishnas Bisket Releasing The Month End
 Neelakanthas Maya Takes Off
 Actor AVS Passes Away
 Write your review on Satya 2
 Write your review on Kaali Charan
 Write your review on Chandi
 AVS Not Well Hospitalized
 Srikanth Tarun Veta Completes Shooting

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.