1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

29న నువ్వే నా బంగారం ఆడియో

IndiaGlitz [Tuesday, November 19, 2013]
Comments

శ్రీ ధనలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'నువ్వే నా బంగారం'. సాయికృష్ణ, షీనా, నిషా కొఠారి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పేరిచర్ల కృష్ణంరాజు నిర్మాత. రామ్ వెంకీ దర్శకుడు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 29న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ప్రస్తుతం చిత్రానికి సంబంధించి డి.ఐ. వర్క్ జరుగుతుంది.ఈ నెల 29న ఆడియో విడుదల చేస్తున్నాం.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతున్న ఈ సినిమాకి సంగీతం ప్రధానాక్షర్షణగా నిలుస్తుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'యూత్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చే అంశాలతో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కచ్చితంగా అందరినీ అలరిస్తుంది' అని అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, ప్రవీణ్, శ్రవణ్, శ్రీరాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలుః అనంత శ్రీరాం, సంగీతంః యాజమాన్య, కెమెరాః రామ్, నిర్మాతః పెరిచెర్ల కృష్ణంరాజు, రచన- దర్శకత్వంః రామ్ వెంకీ.
PVP Cinemas Irandam Ulagam/Varna gives Arya a hat trick opportunity

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.