1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ధూమ్ 4లో అజిత్?

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

మన భారతీయ సినిమాలలో ప్రతినాయకుల పాత్రలకు క్రేజ్ తీసుకువచ్చే సినిమాల సిరీస్ ఏదైనా ఉందంటే. దాని పేరు కచ్చితంగా 'ధూమ్' అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆ సినిమాల్లో విలన్ లుగా నటించేందుకు హిందీ హీరోలు ఇష్టతను ప్రదర్శిస్తున్నారు. 'ధూమ్' కోసం జాన్ అబ్రహం విలన్ గా చేస్తే. 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ ఆ తరహా పాత్రను పోషించాడు. ఇప్పుడేమో 'ధూమ్ 3'లో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నెగెటివ్ రోల్ ని చేస్తున్నాడు.

'ధూమ్ 3' వచ్చే నెల 20న క్రిస్మస్ కానుకగా భారీ స్థాయిలో విడుదల కానుంటే. ఈ లోపే 'ధూమ్ 4' గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాలో నెగెటివ్ రోల్ ని ఎవరు చేస్తారు అనే దానికి సైతం ఓ పేరు వినిపిస్తోంది. అదెవరిదంటే. 'ఆరంభం' తదితర సినిమాల్లో కాస్తంత బ్యాడీగా కనిపించిన అజిత్ ది. బాలీవుడ్ లో అజిత్ కి మార్కెట్ ఉందా లేదా అనేది కాకుండా. ఆ పాత్రకు అతను కరెక్టా కాదా అనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయిప్పుడు. మరి 'ధూమ్ 4'  ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో. అందులో అజిత్ విలన్ గా నటిస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.Other News


Ide Charutho Dating Audio Launch Soon

Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Unify Creations new Film Maine Pyar Kiya

Ide Charutho Dating Audio Launch Soon

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.