Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సరికొత్త మీనాని చూస్తారట

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

90 దశకంలో  'సీతారామయ్యగారి మనవరాలు, సుందరకాండ, అల్లరి అల్లుడు, అబ్బాయిగారు' తదితర చిత్రాలలో మరపురాని పాత్రలలో ఒదిగిపోయిన అందాల నటి మీనా. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసేసుకుని సినిమాలకు విరామమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే టీవీ షోల్లోనూ. సీరియల్స్ లోనూ కనిపిస్తూ వస్తున్న మీనా. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తోందీప్పుడు.  మమ్ముట్టి చిత్రమైన 'బాల్యకాల సఖి'లో అతనికి తల్లిగా నటిస్తుంటే.. మోహన్ లాల్ చిత్రమైన 'దృశ్యం'లో భార్య పాత్రలో యాక్ట్ చేస్తోంది.

'దృశ్యం' గురించి మీనా మాట్లాడుతూ." 'దృశ్యం'లో నాది గృహిణి పాత్ర. ఈ పాత్రను చూసిన ప్రతి ఒక్క గృహిణి తనను తాను పోల్చుకుంటుందన్న నమ్మకం ఉంది. భర్త, పిల్లలతో సరదాగా ఉండడం, సినిమాలు షికార్లు అంటూ సందడి చేయడం.. ఇలాంటి దృశ్యాలన్నీ ఆకట్టుకుంటాయి. నా కెరీర్ లో ఇదో మరచిపోని చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది"అంటూ చెప్పుకొచ్చింది. 'తెలుగులో మళ్లీ ఎప్పుడు'? అని అడిగితే. నటనకు అవకాశమున్న పాత్ర దొరికితే వదిన, అమ్మ, అత్త.. ఇలా ఎలాంటి పాత్రలకైనా సిద్ధమేనంటోంది మీనా.




హవా కొనసాగిస్తున్న నజ్రీయా





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Puri Jagannadh receives a costly gift from NTR
 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Surprised with Bellamkonda Srinivas' dances and fights : Brahmanandam
 Happy Birthday Suriya
 'Gaallo Thelinattundhe' releasing on August 1st
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.