1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెంకటాద్రి తో హిట్ దొరికితే

IndiaGlitz [Thursday, November 28, 2013]
Comments

రెండున్నరేళ్ల క్రితం విడుదలైన 'కెరటం' చిత్రంతో.. టాలీవుడ్ లోకి నాయికగా తొలి అడుగులు వేసింది రకూల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో.. ఇక్కడ సినిమాలకు కొంత విరామమొచ్చింది. మధ్యలో కొన్ని ప్రకటనల్లో.. ఇతర భాషల్లో సినిమాలు చేసుకుపోయిన ఈ నాజూకు సుందరికి ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. సందీప్ కిషన్ సరసన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' కోసం.. ఆది సరసన 'రఫ్' కోసం ఈ ముద్దుగుమ్మ ఆడిపాడుతోంది.

వీటిలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఈ శుక్రవారం (నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రకూల్ చాలా ఆశలనే పెట్టుకుంది. ఇందులో ప్రార్థన అనే యువతి పాత్రలో తాను నటించానని.. ఆ పాత్ర యువతకి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చింది అమ్మడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో హిట్ దొరికితే తన కెరీర్ వేగమందుకుంటుందన్న ఆశాభావంతో ఉన్న రకూల్ ప్రీత్ సింగ్ కి.. ఎలాంటి ఫలితం దొరుకుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.Other News


ఆగడు ఇక ఆగడు

పాండవులు పాండవులు తుమ్మెద లాగే

Is Chiranjeevi Coming Back

Vastha Nee Venaka With Haveesh In The Lead

ఆగడు ఇక ఆగడు

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.