Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సురేందర్ రెడ్డి మారుస్తాడా?

IndiaGlitz [Thursday, December 05, 2013]
Comments

'అతనొక్కడే' చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి. తొలి చిత్రంతోనే కమర్షియల్ హిట్ తో పాటు మంచి గుర్తింపును పొందాడు. రివర్స్ స్ర్కీన్ ప్లే ని తెలుగువారికి బాగా సుపరిచితం చేసిన ఈ దర్శకుడు మొదటి చిత్రం తరువాత. ఎన్టీఆర్ తో చేసిన 'అశోక్'తోనూ. అలాగే మహేష్ బాబుతో చేసిన 'అతిథి'తోనూ పరాజయాలనే చవిచూడాల్సి వచ్చింది. అయితే రవితేజతో చేసిన నాలుగో చిత్రం అయిన 'కిక్'తో ఈ దర్శకుడి ఖాతాలోకి చాన్నాళ్ల తరువాత మరో సక్సెస్ వచ్చి చేరింది.

ఆ 'కిక్' తరువాత మరోసారి తారక్ తో చేసిన 'ఊసరవెల్లి'  ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరీ సురేందర్ రెడ్డి ఓ సినిమా చేస్తున్నాడు. అదే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'రేసుగుర్రం'. శ్రుతి హాసన్, సలోని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంపై సురేందర్ రెడ్డి భారీ ఆశలనే పెట్టుకున్నాడు. 

'అతనొక్కడే' వంటి ఓ హిట్ తరువాత రెండు ఫ్లాఫ్ లను ఇచ్చిన సురేందర్ రెడ్డి.. 'కిక్' అనే మరో హిట్ తరువాత ఆల్రెడీ ఓ ఫ్లాప్ ఇచ్చేసిన ఇతడు  సెంటిమెంట్ ప్రకారం రెండో ఫ్లాప్ ని మూటగట్టుకుంటాడా లేక చరిత్రని తిరగరాసి హిట్ ని సొంతం చేసుకుంటాడా? అని పరిశీలకులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే. 'రేసుగుర్రం' ఫస్ట్ లుక్ సురేందర్ రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 7న విడుదల కానుందని సమాచారం.




బిరియాని'లో ప్లేబోయ్ గా కార్తీ?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 LOOK: Aamir Khan's Eight-Pack Body for 'PK'
 Venkatesh in the remake of 'Salim'
 'Aagadu' creates all time record in USA
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 Write your own review on 'Aagadu'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.