Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కన్నడ సీమలో బ్రహ్మానందం

IndiaGlitz [Friday, December 06, 2013]
Comments

తెలుగునాట సుదీర్ఘ కాలంగా తన హాస్యంతో హాస్యప్రియులను ఎంతగానో అలరిస్తున్న కమెడీయన్ బ్రహ్మానందం. తన వినోదాన్ని కేవలం మాతృభాషకు మాత్రమే పరిమితం చేయకుండా హిందీ (సూర్యవంశ్), తమిళ్ (గిల్లి, న్యూ, మోళి..) వంటి భాషల్లోనూ అలరించిన చరిత్ర బ్రహ్మికి ఉంది. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు మరో భాషలోనూ తన మార్క్ కామెడీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ భాష కన్నడం కాగా. చిత్రం పేరు 'నిన్నిందలే'.

విజయవంతమైన పలు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో.. తొలి కన్నడ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్, ఎరికా ఫెర్నాండేజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల బ్రహ్మానందం, ఎరికా ఫెర్నాండేజ్ ల పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. వాటిలో బ్రహ్మి ఎంతో యాక్టివ్ గా ఉన్నారని. ఈ చిత్రం తరువాత మరిన్ని కన్నడ సినిమాల్లో ఆయన సందడి చేసే అవకాశం పుష్కలంగా ఉందంటూ చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మానందమా.. మజాకానా!




'Rudrama Devi' Completes 60pc Shooting



Other NEws

Rudrama Devi Completes 60pc Shooting

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.