1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

బిరియాని కార్తీది కాదట

IndiaGlitz [Sunday, December 08, 2013]
Comments

'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరుశివ' వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన తమిళ కథానాయకుడు కార్తీ. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం 'బిరియాని' ఈ నెల 20న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు.

సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా ఈ చిత్రంతో 100 చిత్రాల మైలురాయిని చేరుకుంటున్నాడు. ఇదిలా ఉంటే. 'బిరియాని' కథని దర్శకుడు వెంకట్ ప్రభు. కార్తీని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని. విజయ్ ని దృష్టిలో పెట్టుకుని రాసాడని. తొలుత ఈ సినిమాని చేయడానికి విజయ్ అంగీకరించినా. కాల్షీట్ల సమస్య కారణంగా  'బిరియాని' ని వదులుకున్నాడని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ తరువాత 'బిరియాని'ని సూర్యతో చేయడానికి ప్రయత్నించినా అతనిదీ అదే పరిస్థితి కావడంతో. కార్తీ ఓకే చెప్పడంతో ఈ సినిమాకి ఓ రూపం వచ్చిందట. కథాబలమున్న ఈ స్టైలీష్  సినిమాతో కార్తీ కెరీర్ లో ఓ ఘనవిజయం ఖాయమని అక్కడి సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Apple Studios Hum Tum Audio On 9th December

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.