1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాణంలో ఒకలా బసంతిలో మరోలా

IndiaGlitz [Sunday, December 08, 2013]
Comments

దర్శకుడిగా తొలిగా చేసిన ప్రయత్నంతోనే మంచి మార్కులు పొందారు 'బాణం' డైరెక్టర్ చైతన్య దంతులూరి. నారా రోహిత్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన నాలుగేళ్ల క్రిందట రూపొందించిన 'బాణం'. అప్పట్లో విమర్శకుల ప్రశంసలను పొందడమే కాదు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుంది.

ఇప్పుడీ దర్శకుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా  'బసంతి' అనే పేరుతో ద్వితీయ ప్రయత్నాన్ని చేస్తున్నారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి. 'బాణం' కి మంచి స్వరాలు అందించిన మణిశర్మనే సంగీత మందిస్తున్నారు. అలీషా బేగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వైవిధ్యభరితంగా తెరకెక్కిందని చైతన్య చెప్పుకొస్తున్నారు.

'బాణం' కి, 'బసంతి' కి  అస్సలు సంబంధం ఉండదని చెబుతున్నారు.  'బాణం' చిత్రీకరణని హైదరాబాద్ లో అస్సలు జరపకోవడం ఒకలాంటి అనుభూతినిస్తే. 'బసంతి' ని పూర్తిగా హైదరాబాద్ లోనే  షూట్ చేయడంతో మరోలా అనుభూతిని పొందానని చెప్పుకొస్తున్నారు సదరు దర్శకుడు. మంచి ప్రయత్నంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న చైతన్య. ఈ సారి కచ్చితంగా మునుపటి కంటే మెరుగైన ఫలితం పొందుతారని చిత్రయూనిట్ పేర్కొంటోంది.Other News


బిరియాని కార్తీది కాదట

Apple Studios Hum Tum Audio On 9th December

Dharmavarapu Subrahmanyam Passes Away

Will Do A Movie Based On Pullela Gopichand: Sudheer Babu Posani

బిరియాని కార్తీది కాదట

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.