1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దూకుడు రీమేక్ లో త్రిష

IndiaGlitz [Tuesday, December 10, 2013]
Comments

రెండేళ్ల క్రితం విడుదలై తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా 'దూకుడు'. మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ తెలుగు చిత్రాన్ని.. అతి త్వరలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడంలోకి రీమేక్ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ 'దూకుడు' కన్నడ రీమేక్ అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది. తెలుగులో సమంత పోషించిన పాత్రని.. కన్నడంలో త్రిష పోషించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లోనే నటించి రెండుచోట్ల  అగ్ర కథానాయికగా రాణించిన త్రిష.... తొట్ట తొలిసారిగా ఓ కన్నడ సినిమా నటించేందుకు అంగీకరించడాన్ని కోలీవుడ్ వర్గాలు విశేషంగా చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా కోసం త్రిష భారీ పారితోషికాన్ని అందుకోబోతుందని ఆ వార్తల సారాంశాన్ని బట్టి తెలుస్తోంది. ఇంతకీ 'దూకుడు' రీమేక్ కి ఆమె కన్ ఫర్మ్ అయిందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Hyderabad Love Story Theatrical Trailer LaunchedOther News


Manushulato Jagratta Releasing On 21st December

Brahmaji Son Wedding

Yes Producers Have Taken Back Advance Amounts: Harish Shankar

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.