1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒకే నెలలో 4 మెగా మూవీస్?

IndiaGlitz [Tuesday, December 10, 2013]
Comments

చిన్న నెలగా పేరుగాంచడమే కాకుండా చిన్న సినిమాల నెలగానూ ఉండే ఫిబ్రవరి.. 2014లో సినిమాల సందడికి చిరునామాగా నిలవనుంది. రానున్న ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాల హడావుడి ఉండే అవకాశం ఉందంటున్నారు తెలుగు సినీ వర్గాల బాబులు.

మరీ ముఖ్యంగా 2014 ఫిబ్రవరి మెగా మూవీస్ కి చిరునామా అయ్యే అవకాశం కనిపిస్తుందంటున్నారు వారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు మెగామూవీస్ ఫిబ్రవరికి తాత్కాలిక ముహుర్తాన్ని కుదుర్చుకున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అల్లు అర్జున్ 'రేసు గుర్రం' ఫిబ్రవరి మొదటివారంలో రిలీజ్ కానుందంటూ వార్తలు వినిపిస్తుంటే.. సాయిధరమ్ తేజ తొలి చిత్రం 'రేయ్' కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆ నెల చివరి వారంలో అల్లు శిరీష్ రెండో చిత్రం 'కొత్త జంట' ప్రేక్షకుల ముందుకు వచ్చే దిశగా నిర్మాణం జరుపుకుంటుండగా..

సాయిధరమ్ తేజ రెండో చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' ది కూడా దాదాపు అదే పరిస్థితి అని తెలుస్తోంది. చివరాఖరికి వీటిలో ఏ ఏ సినిమాలు ఫిబ్రవరిలో కచ్చితంగా రిలీజ్ అవుతాయన్నది తేలడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు.
హైద్రాబాద్ లవ్ స్టోరీOther News


దూకుడు రీమేక్ లో త్రిష

Hyderabad Love Story Theatrical Trailer Launched

Manushulato Jagratta Releasing On 21st December

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Allari Naresh ties the knot with Virupa
 Telugu director gets a call from PM Narendra Modi
 First look: Tabu as IG Meera Deskhmukh
 Anushka gains 15 kgs for Size Zero
 Rajinikanth visits Ashram in Coimbatore
 Vikram turns villain for Super Star ?
 Hrithik gobsmacked by Pooja Hegde?
 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.