1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పోలీస్ అధికారిణిగా నయనతార

IndiaGlitz [Wednesday, December 11, 2013]
Comments

రొటీన్ హీరోయిన్ వేషాలతో పాటు.. నటనకు అవకాశమున్న పాత్రల్లోనూ అభినయించి మంచి కథానాయికగా పేరు తెచ్చుకుంది కేరళకుట్టి నయనతార.. ఇటీవలే తమిళంలో 'రాజా రాణి, ఆరంభం' సినిమాలతో రెండు వరుస ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అతి త్వరలో 'అనామిక'గా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నయన ఓ తమిళ సినిమా కోసం సీరియస్ పోలీస్ అధికారిణిగా దర్శనమివ్వనున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 'జయం' రాజా దర్శకత్వంలో 'జయం' రవి, నయనతార జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం నయనతార ఓ పోలీసాఫీసర్ గా నటిస్తోందని తమిళనాట చెప్పుకుంటున్నారు.

తొలిసారిగా పోలీస్ వేషంలో దర్శనమివ్వనున్న నయన.. సదరు పాత్రలో ఇట్టే ఇమిడిపోతుందని కూడా వారు తెలుపుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజయ్యే అవకాశముంది.
SECOND HAND overseas by SUPREME MOVIES LLC

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 SECOND HAND overseas by SUPREME MOVIES LLC
 'హైద్రాబాద్ లవ్ స్టోరీ'
 'దూకుడు' రీమేక్ లో త్రిష
 'Hyderabad Love Story' Theatrical Trailer Launched
 Manushulato Jagratta Releasing On 21st December
 Brahmaji Son Wedding
 Yes Producers Have Taken Back Advance Amounts: Harish Shankar
 Media Is Not Bad Only Some Scribes Are: Harish Shankar
 Pawan Kalyan Contributed Immensely For Gabbar Singh
 Amma Nanna Oorelite Releasing For Pongal
 Isha To Star Opposite Haveesh In Vastha Nee Venaka
 4 చిత్రాలతో రానున్న ధిల్ రాజు
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.