1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కిరాక్ ప్రారంభం

IndiaGlitz [Thursday, December 12, 2013]
Comments

శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా బ్యానర్ లో తెరకెక్కతున్న సినిమా 'కిరాక్.' అనిరుద్ధ్ , 'కాళీ చరణ్' ఫేమ్ చాందిని హీరోహీరోయిన్లు. ఈ సినిమా గురవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. గంగపట్నం శ్రీధర్ నిర్మాత.. హారిక్ దర్శకుడు. ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ నివ్వగా,  దర్శకుడు దేవాకట్టా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్వకత్వం వహించారు. అనంతరం పాత్రికేయులతో.

నిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ 'ఇదో మంచి లవ్ స్టోరీ. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. నిర్మాతగా ఇది నాకు మూడో చిత్రమిది. ఈరోజు నుండి రెగ్యులర్ చిత్రీకరణ చేసి సినిమాని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం. సినిమాని మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం' అని అన్నారు.

దర్శకుడు హారిక్ మాట్లాడుతూ 'ఇంతకుముందు పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. దర్శకుడిగా నా మొదటి సినిమా. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా తెరకెక్కిస్తున్నాం' అని తెలిపారు.

అనిరుద్ధ్ మాట్లాడుతూ 'ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుందన్నందుకు చాలా సంతోషం. ఇదొక భిన్నమైన ప్రేమకథ. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే కాన్పెప్ట్ తో రూపొందుతుంది'అన్నారు.

చాందిని మాట్లాడుతూ 'కాళీచరణ్ తర్వాత మరో మంచి సినిమా. ఇది పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు'అని అన్నారు.Other News


తుమ్మెద సెన్సార్ పూర్తి

Tummeda Completes Censor And Releasing This Month

Trisha forays into Kannada movies with remake of Dookudu

Baba Sehgal Dances to the Tunes of Pandavalu Pandavulu Thummeda

తుమ్మెద సెన్సార్ పూర్తి

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.