1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

లెజెండ్లో ఒకటి కాదు రెండు

IndiaGlitz [Friday, December 13, 2013]
Comments

'సింహా' వంటి సంచలన విజయం తరువాత కథానాయకుడు బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'లెజెండ్' (పరిశీలనలో ఉన్న టైటిల్). రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. జగపతిబాబు ప్రతినాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్. సంగీత దర్శకుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే. 'లెజెండ్'లో హీరోయిన్ల పరంగా క్రేజ్ లేకపోయినా.. ఆ లోటుని కొంతమేర భర్తీ చేయడానికి చిత్రయూనిట్ కథలో భాగంగా ప్రత్యేక గీతాలను చొప్పిస్తోందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమాలో ఒకటి కాదు ఏకంగా రెండు ఐటమ్ పాటలను చేర్చారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అందులో ఎవరెవరు నర్తించారన్న విషయంలో మాత్రం స్ఫష్టత లేదు. అదిరిపోయే ఐటమ్ పాటలకు చిరునామా అయిన దేవిశ్రీ. ఇందులోనూ తన స్థాయికి తగ్గట్టే స్పెషల్ సాంగ్స్ కి ట్యూన్స్ ఇచ్చాడని సమాచారం.
Happy Birthday To Victory Venkatesh

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.