1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బిరియానితో మొదలెడుతున్నారు

IndiaGlitz [Sunday, December 15, 2013]
Comments

కార్తీ, హన్సిక జంటగా నటించిన చిత్రం 'బిరియాని'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కి 100వ చిత్రం అయిన 'బిరియాని'పై రెండు భాషల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ టెక్నాలజీని అటు తమిళ ప్రేక్షకులకు.. ఇటు తెలుగు ప్రేక్షకులకు ఏకకాలంలో అనుభవంలోకి తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోందని సమాచారం. అదేమిటంటే.. ఈ సినిమాని 'డాల్బీ ఆట్మాస్' సౌండ్ అనే టెక్నాలజీతో రెండు భాషల్లోనూ రిలీజ్ చేయబోతోందట స్టూడియో గ్రీన్.  తెలుగు, తమిళ భాషల్లో ఆ టెక్నాలజీతో ఇంతకుముందు ఏ సినిమా రాలేదని.. ఆ టెక్నాలజీని ఈ ఇరు భాషల్లోకి 'బిరియాని'తో మొదలెడుతున్నామని చిత్ర వర్గాలు చెప్పుకొస్తున్నాయట.
KarthiHansika Biryani Releasing On 20th December

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.